: పారిపోయి ఒక్కటైన ఇద్దరు యువతులు
బీహార్లోని పాట్నాకు చెందిన ఇద్దరు యువతులు ముచ్చటపడి పెళ్లి చేసుకున్నారు. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న వీరు కలిసి సాగుదామనే నిర్ణయంతో ఈ నెల 4 నుంచి కనిపించకుండా పోయారు. వీరిలో ఒక యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిపోయిన ఇద్దరూ రోహ్ తక్ జిల్లాలోని ససారామ్ లో ఒక గుళ్లో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు వెళ్లి చూసేసరికి ఆ ఇద్దరూ ససారం లోని ఒక హోటల్లో దంపతుల్లా కనిపించారు. బిత్తరపోయి చూడడం పోలీసుల వంతు అయింది. మొబైల్ ఫోన్ లొకేషన్ ద్వారా వీరి ఆచూకీని గుర్తించారు.