: రూ.2 కోట్ల విలువైన వజ్రాలు ఖాళీ


ముంబైలోని ఒపేరా హౌస్ లో ఒక షాపు నుంచి 2 కోట్ల రూపాయల విలువైన వజ్రాలను దొంగలు కొల్లగొట్టారు. ఈ భారీ చోరీ ఆదివారం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రెంచ్ బ్రిడ్జి ప్రాంతంలోని ఒపేరా హౌస్ లో దావల్ షా అనే వర్తకుడు 'మా కృప ఎంటర్ ప్రైజెస్' షాపును నిర్వహిస్తున్నారు. సోమవారం తన షాపునకు వెళ్లి చూసేసరికి చోరీ జరిగిందని గుర్తించి డీబీ మార్గ్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమికంగా 2 కోట్ల రూపాయల వజ్రాలు చోరీకి గురయ్యాయని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

  • Loading...

More Telugu News