: పవన్ కల్యాణ్, నాగబాబు టీడీపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తాం: యనమల
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు తెలుగుదేశం పార్టీలోకి వస్తామంటే... వారికి స్వాగతం పలుకుతామని టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. తెలుగు వారి కోసం, తెలుగు జాతి కోసం పోరాడేందుకు టీడీపీనే సరైన వేదికని తెలిపారు. మెగా బ్రదర్స్ టీడీపీ ఎంట్రీ గురించి బాలయ్య చర్చలు జరిపారన్న విషయంపై తన దగ్గర సమాచారం లేదని అన్నారు. త్వరలోనే కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరనున్నారని యనమల వెల్లడించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీపై రాష్ట్ర వ్యాప్తంగా హాట్ హాట్ గా చర్చలు సాగుతోన్న సంగతి తెలిసిందే. ఆయన సొంత పార్టీ పెడతారన్న వార్తలు కొన్ని... ఆయన టీడీపీలో చేరతారన్న వార్తలు మరికొన్ని. ఏదైతేనేం, అత్తారింటికి సినిమాతో మెగా హిట్ కొట్టిన పవన్... ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ వార్తలతో మరోసారి న్యూస్ హెడ్ లైన్స్ లో స్థానం సంపాదించారు.