: విజయనగరంలో వైభవంగా సిరిమానోత్సవం


గజపతి రాజుల ఇలవేల్పు పైడితల్లమ్మ సిరిమానోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ రోజు తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. గజపతి రాజుల ఆడపడుచుగా పూజలందుకున్న పైడితల్లమ్మ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు ఇలవేల్పు. తరాలుగా అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. పైడితల్లి అమ్మవారికి పూజలు చేసేందుకు ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి కూడా భారీగా భక్తులు విచ్చేస్తున్నారు. కాగా, భక్తులు ఘటాల్ని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. భక్తులు తాము తీసుకొచ్చిన ఘటాలను అమ్మవారికి చూపించి మొక్కులు తీర్చుకుంటారు.

  • Loading...

More Telugu News