: పిటిషన్ ను ఉపసంహరించుకున్న లగడపాటి


ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ను విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెనక్కి తీసుకున్నారు. రాజీనామాలు ఆమోదించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ కొన్ని రోజుల కిందట లగడపాటి ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. అయితే, పిటిషన్ ను వెనక్కు తీసుకోవాలని కేంద్రమంత్రి మంత్రి కమల్ నాథ్ చేసిన విజ్ఞప్తి మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News