: గుట్టు విప్పని మక్బూల్, ఇమ్రాన్!


హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ప్రస్తుతం ఎన్ఐఏ విచారణ ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిదిన్ తీవ్రవాదులు మక్బూల్, ఇమ్రాన్ పెదవి విప్పడంలేదు. డెక్కన్ ముజాహిదిన్ సభ్యులు తబ్రేజ్, వకాస్ లకు ఈ పేలుళ్లతో సంబంధం ఉండొచ్చని వెల్లడించిన వీరిద్దరూ అంతకుమించి సమాచారం ఇవ్వడంలేదని తెలుస్తోంది.

ఎన్ఐఏ మూడోరోజూ తన విచారణ కొనసాగించింది. మక్బూల్, ఇమ్రాన్ లకు సీసీటీవీ పుటేజిలు చూపించినా, వారి నుంచి సరైన స్పందన లేదని అధికార వర్గాలంటున్నాయి. వీరు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. 

  • Loading...

More Telugu News