: ఎన్నికల్లోపే ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ!
ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండగా.. ఆ లోపే దేశంలో మరో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని కేంద్రం పట్టుదలగా ఉంది. చెన్నై, కోల్ కతా, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గౌహతి విమానాశ్రయాలు వీటిలో ఉన్నాయి. నిర్ణీత సమయంలో వీటి ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేయగలమనే ఆశాభావంతో ఉన్నామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీవాస్తవ తెలిపారు. ప్రస్తుతం వాటాదారులతో చర్చిస్తున్నామని చెప్పారు.