: అమితాబ్ కు 'హృదయనాథ్' అవార్డు
బాలీవుడ్ కు చేసిన సేవలకు గాను మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు 'హృదయనాథ్' అవార్డును అందించనున్నారు. గాయని లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ హృదయనాథ్ ఆర్ట్స్ ఈ అవార్డును ప్రకటించింది. ఈ నెల 26న ముంబైలో జరిగే మ్యూజికల్ నైట్ లో లతా మంగేష్కర్ ఈ అవార్డును అమితాబ్ కు ప్రదానం చేస్తారు.