: నియంత్రణ రేఖ వద్ద నేడు షిండే పర్యటన
నియంత్రణ రేఖ వద్ద రోజుల వ్యవధిలోనే దాయాది దేశం పాకిస్థాన్ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేడు జమ్మూకాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆయన సరిహద్దు వద్ద భద్రతను పరిశీలించనున్నారు. ప్రస్తుతం సాంబా సెక్టార్ చేరుకున్న షిండే సరిహద్దు వద్ద పాక్ కాల్పులు జరుపుతున్న ప్రాంతాన్ని మరి కొన్ని గంటల్లో సందర్శిస్తారు. అనంతరం అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.