: పారిపోవడం పరిష్కారం కాదు: 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవిశంకర్
అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్లిన ఆధ్యాత్మిక వేత్త ఆశారం బాపు తనయుడు నారాయణ్ సాయి లొంగిపోవాలని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ సొసైటీ' వ్యవస్థాపకులు రవిశంకర్ సూచించారు. పారిపోవడం సమస్యకు పరిష్కారం కాదని, తప్పు చేయనప్పుడు పోలీసులకు భయపడాల్సిన పనిలేదన్నారు. ఆశారాం వ్యవహారం గురించి రవిశంకర్ వద్ద మీడియా ప్రస్తావించగా.. ఈ వ్యవహారం అంతా సంత్ సమాజంపై మచ్చగా అభివర్ణించారు.