: బాలీవుడ్ డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నిందితుడి అరెస్ట్
ముంబైలో బ్రిటన్ యువతి (26) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ చిత్రాలలో డ్యాన్సర్ గా పనిచేసే బ్రిటన్ మహిళ సోమవారం సాయంత్రం ఓషివారా ప్రాంతంలో ఉండగా.. నిందితుడు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెతోపాటు పక్కనున్నవారు పెద్దగా అరవగా.. పారిపోతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.