: అమ్మవారి ఉత్సవాల్లో అశోకగజపతిరాజుకు అవమానం


విజయనగరంలో జరుగుతున్న సిరిమాను ఉత్సవాల్లో తెదేపా సీనియర్ నాయకుడు అశోకగజపతిరాజుకు ఘోర అవమానం జరిగింది. కొద్దిసేపటి క్రితం పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన అశోకగజపతిరాజును పోలీసులు అడ్డుకున్నారు. బంధువులు, కార్యకర్తలతో తరలివచ్చిన అశోక్ ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఇంత మందిని లోపలకు అనుమతించలేమని... మీతో పాటు ఐదుమందిని మాత్రమే లోపలకు పంపిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో ఆలయ ధర్మకర్త కూడా అయిన అశోక్ పోలీసులపై తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా అమ్మవారి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు.

  • Loading...

More Telugu News