: షుగరుకు జెల్‌తో చెక్ చెప్పవచ్చు!
షుగరువ్యాధిని నియంత్రించడానికి వైద్యులు పలు రకాల వైద్యవిధానాల ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇందులో సరికొత్తగా కనుగొన్న విధానం జెల్‌తో షుగరు వ్యాధిని నియంత్రించడం. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు షుగరు వ్యాధి నియంత్రణకు జన్యురూపాంతరం చెందిన కాంతి గ్రాహక కణాలతో ప్రత్యేకమైన జెల్‌ను తయారుచేశారు. ఈ జెల్‌ను శరీరంలోకి చొప్పించి తద్వారా ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరచి రక్తంలోని చక్కెర స్థాయిని నిలకడగా ఉండేలా చేస్తారట. అంటే ఈ జెల్ శరీరంలోకి వెళ్లగానే రక్తంలోని చక్కెర స్థాయిని నిలకడగా ఉంచే ప్రత్యేక పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జెల్ నమూనా స్థాయిలోనే ఉందని, త్వరలోనే ఈజెల్‌ను వినియోగంలోకి తీసుకొస్తామని పరిశోధకులు చెబుతున్నారు.