: ఆరోపణలు చేసేముందు వాస్తవాలు తెలుసుకోవాలి: సీఎం


ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. మానసిక స్థితి సరిగా లేని కొందరు నాయకులు కక్ష పూరిత ధోరణితో తనపై ఆరోపణలు చేస్తూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తిరుపతిలో సోనియాకు సమాధి కట్టడంపై స్పందించలేదని అనడం అవాస్తమని, ఆ విషయం తెలిసిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించానన్నారు. పోలీసులు దీనికి బాధ్యులైన 10 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News