: డబ్బు కట్టలపై పవళించిన ప్రజాప్రతినిధి బహిష్కరణ
చిరకాల వాంఛ తీర్చుకునేందుకు త్రిపురలో తన ఖాతా నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుని మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని, వాటిపై పడుకుని వీడియో తీయించుకున్న ప్రజాప్రతినిధికి తగిన శాస్తి జరిగింది. వామపక్ష పార్టీకి చెందిన సదరు ప్రజాప్రతినిధిని ఆ పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు త్రిపుర సీపీఎం పార్టీ కార్యాలయం ప్రకటించింది. సమానత్వం కోసం పోరాడే వామపక్ష పార్టీలో అతనికి స్థానం లేదని, పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.