: రాష్ట్ర విభజనకు ఆ రెండు పార్టీలే అనుకూలం: శోభా నాగిరెడ్డి
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలే అనుకూలంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ నేత శోభా నాగిరెడ్డి ఆరోపించారు. విభజనకు మద్దతు తెలిపే పార్టీలను వ్యతిరేకించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 26న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో హైదరాబాదులో సమైక్య శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా, ఆ సభపై ఆమె మీడియాతో మాట్లాడారు. తాము రాజకీయాలకు అతీతంగా సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమైక్యానికి మద్దతిచ్చే పార్టీలను బలపరిచి, మిగతా పార్టీలను ఒత్తిడికి గురిచేయాలని ఆమె ప్రజలకు సూచించారు.