: విశాఖలో భారీ వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారీ వర్షం నమోదు కావడం ఇదే మొదటిసారి. కురుస్తున్న వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం రేపు కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.