: ప్రియాంక చోప్రా పెద్ద మనసు.. కేన్సర్ వార్డు నిర్మాణానికి భారీ విరాళం


బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన తండ్రి జ్ఞాపకార్థం ఓ ఆసుపత్రికి భారీ విరాళం ప్రకటించారు. ఇటీవలే ప్రియాంక తండ్రి అశోక్ కేన్సర్ తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ఏదైనా చేయాలని భావించిన ప్రియాంక.. ముంబై శివారు ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో కేన్సర్ వార్డు నిర్మాణానికి రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. నూతనంగా నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ప్రియాంక హాజరవుతారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News