: సినిమా పోలీసులు వేరు.. నిజం పోలీసులు వేరు: సీవీ ఆనంద్
పెరిగిపోతున్న నేరాలను అదుపు చేసేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కుషాయిగూడలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం చర్లపల్లిలో కారాగారం వద్ద పోలీసు అవుట్ పోస్టును, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో నిర్మించిన సిబ్బంది విశ్రాంతి గదిని ప్రారంభించారు. చర్లపల్లి జైలు వద్దే మరో అవుట్ పోస్టు భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. సినిమాలోని పోలీసుల పాత్రలు నిజజీవితంలో పోలీసులకు భిన్నంగా ఉంటాయని ఆయన తెలిపారు.