: థాయ్ మసాజ్ కావాలా... ఎంట్రీ ఫీజు వెయ్యి కట్టండి!


'థాయ్ మసా'.. అంటూ విలక్షణ వేషధారణతో 'చిరుత' సినిమాలో అలీ చేసిన వినోదం సినీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఈ థాయ్ మసాజ్ కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మసాజ్ కోసం విదేశీ పర్యాటకులు థాయ్ లాండ్ కు భారీగా విచ్చేస్తుంటారు. ప్రధానంగా భారతీయులకు థాయ్ మసాజ్ అంటే తగని మక్కువ. దీంతో విదేశీ పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతున్న థాయ్ లాండ్ తాజాగా వీరి ఇష్టాన్ని సొమ్ము చేసుకునేందుకు పథకం రచించింది.

విదేశీయుల నుంచి ప్రతిదేశం ఎంట్రీ ఫీజు వసూలు చేస్తుంది. కానీ, థాయ్ లాండ్ కు ఇంతవరకు ఆ ఫీజేమీ లేదు. దీంతో పర్యాటకులు ఇక్కడికి వెల్లువెత్తుతున్నారు. దీంతో ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రదీప్ సింటావనరాంగ్ పోలీసు శాఖతో కలిసి చర్చించి వెయ్యి రూపాయలు ఎంట్రీ ఫీజుగా వసూలు చేసేందుకు నిబంధన తెచ్చారు. దీని ప్రకారం థాయ్ లాండ్ సందర్శనకు వచ్చే పర్యాటకులెవరైనా వచ్చే ఏడాది నుంచి వెయ్యి రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News