: భారత్ ను చిత్తు చేస్తాం: విండీస్ కోచ్ ధీమా


భారత్ ను వారి సొంత గడ్డపైనే ఓడిస్తామని విండీస్ కోచ్ ఒటిస్ గిబ్సన్ ధీమా వ్యక్తం చేశాడు. బ్రిడ్జ్ టౌన్ లో మీడియాతో మాట్లాడుతూ, చివరిసారి భారత్ కు వచ్చినప్పటి కంటే ఇప్పుడు విండీస్ జట్టులోని ఆటగాళ్ళు అనుభవజ్ఞులని చెప్పుకొచ్చాడు. వారు ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని పేర్కొన్నాడు. సిరీస్ గెలవలేకపోవడానికి తమకేమీ కారణాలు కనిపించడంలేదని అన్నాడు. అయితే, భారత్ తో పోరు హోరాహోరీగా సాగుతుందని చెప్పాడు. కాగా, టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు విండీస్ ఈ నెలాఖర్లో భారత్ రానుంది. నవంబర్ 6 నుంచి 10 వరకు తొలి టెస్టు (కోల్ కతా), నవంబర్ 14 నుంచి 18 వరకు రెండో టెస్టు (ముంబయి) జరగనున్నాయి. నవంబర్ 21 నుంచి వన్డే సిరీస్ ఆరంభమవుతుంది.

  • Loading...

More Telugu News