: లారీ ఈడ్చుకెళ్లినా.. బతికిన అదృష్టశాలి..!
అదృష్టం అంటే ఇదేనేమో! నాగపూర్ లో ఈరోజు ఉదయం ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన బైక్ పై రోడ్డు మీద వెళుతుండగా ఓ లారీ ఆమె బైక్ ను ఢీకొట్టింది. కిందపడ్డ ఆమెను బైక్ తో సహా లారీ కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది కూడా. అయినా ఆమెకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. అంతటి షాక్ లోనూ ఆమె నిర్లక్ష్యంగా లారీ నడిపిన డ్రైవర్ ను పట్టుకునేందుకు పరిగెత్తిన తీరు చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సంఘటన అంతా అక్కడి సీసీకెమెరాలో నిక్షిప్తమైంది.