: రాష్ట్ర విభజనను ఆపే శక్తి సీఎంలకు ఉండదు: సందీప్ దీక్షిత్


రాష్ట్ర విభజనను అడ్డుకునే శక్తి సీఎంలకు ఉండదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమస్యను పార్లమెంటు మాత్రమే పరిష్కరిస్తుందని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, మంత్రుల బృందం సిఫారసుల ఆధారంగా బిల్లు తయారవుతుందని చెప్పారు. ఆ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే రాష్ట్రం ఏర్పడుతుందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

  • Loading...

More Telugu News