: మరో నాలుగు చోట్ల ఐటీఐఆర్ ప్రతిపాదన: పొన్నాల


విశాఖలో 12 వేల ఎకరాల్లో ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ నివేదిక సిద్ధం చేసినట్లు మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. అదేవిధంగా తిరుపతి, అనంతపురం, మన్నవరం కారిడార్ లోని 4 వేల ఎకరాల్లోనూ ఐటీఐఆర్ ప్రతిపాదనలు తేనున్నామని ఆయన వెల్లడించారు. హైదరాబాదులో నిర్మించనున్న ఐటీఐఆర్ కోసం రేపు వివిధ శాఖల అధిపతులు, ఐటీ నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. మండల కార్యాలయాల నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం సిద్ధమైందని, ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. త్వరలో సీఎం స్థాయిలో సమీక్ష జరిపి మేడారం జాతర పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News