: పోలీసు అమరవీరుల దినోత్సవం రోజున హోంగార్డులను చితకబాదిన పోలీసులు
విధి నిర్వహణలో ఎవరైనా తమకు ఒకటే అన్నట్టుంది యూపీ పోలీసుల తీరు. జీతాలు పెంచాల్సిందిగా ఉత్తరప్రదేశ్ హోంగార్డులు ఆ రాష్ట్ర అసెంబ్లీ వద్ద నిరసనకు దిగారు. అయితే అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు వారిని హెచ్చరించారు. తమకు హామీ వస్తేనే కానీ కదిలేదిలేదన్న హోంగార్డులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. అయినప్పటికీ వారు కదలకపోవడంతో బాష్పవాయువు ప్రయోగించారు. తమకు చేదోడువాదోడుగా ఉండే హోంగార్డులపైన.. పోలీసు అమరవీరుల దినోత్సవం రోజునే పోలీసులు తమ ప్రతాపం చూపడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.