: రాగల 48 గంటల్లో రాయలసీమలో భారీ వర్షాలు
వచ్చే 48 గంటల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ లపై కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీంతో రాయలసీమలోనూ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.