: మా నగరానికి విశిష్ట అతిథులు వస్తున్నారు: మమతా బెనర్జీ


నవంబర్ 10 తమ రాష్ట్రానికి సుదినం అని.. ఆ రోజు కోల్ కతా వాసులకు చిరస్మరణీయమైన రోజని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫేస్ బుక్ లో తెలిపారు. ఎందుకంటే, ఆ రోజు క్రికెటర్ సచిన్, బిగ్ బి అమితాబ్, షారూఖ్ ఖాన్ లాంటి హేమా హేమీలకు నగరం ఆతిథ్యం ఇవ్వనుందని పోస్ట్ పెట్టారు. నవంబర్ 10న సచిన్ తన 199 టెస్టును ఆడేందుకు కోల్ కతా రానుండగా, 19వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనేందుకు అమితాబ్, షారూఖ్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు రానున్నారని అందువల్ల ఇది తమకు పండుగ సమయమని దీదీ పేర్కొన్నారు. గతేడాది సచిన్ వంద సెంచరీలు పూర్తి చేసిన సందర్భంగా కోల్ కతా వచ్చినప్పుడు ఈడెన్ గార్డెన్స్ లో బంగారు బ్యాట్ బహూకరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News