: చేతులు కలిపిన పదకొండు ఈశాన్య పార్టీలు
2014 లోక్ సభ ఎన్నికల ముందు ఈశాన్య రాష్ట్రాల్లోని చిన్న పార్టీలు 'నార్త్ ఈస్ట్ రీజనల్ పొలిటికల్ ఫ్రంట్'(ఎన్ఈఆర్ పీఎఫ్)గా ఏర్పడ్డాయి. అసోం గణ పరిషత్ (ఏజీపీ) సహా మొత్తం పదకొండు పార్టీలు ఈ ఫ్రంట్ లో ఉన్నాయి. నిన్న(ఆదివారం) గౌహతిలో నిర్వహించిన సమావేశంలో ఈ ప్రకటన చేశాయి. తమ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపాయి. ఏజీపీ, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్ పీఎఫ్), మిజో నేషనల్ ఫ్రంట్, మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ (ఎమ్ఎస్ సీపీ), మేఘాలయ నుంచి పలు పార్టీలు, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పార్టీలు కూడా ఈ ఫ్రంట్ లో ఉన్నాయి. కాగా, ఈశాన్య రాష్ట్రాల నుంచి లోక్ సభలో 25 మంది ఎంపీలున్నారు.