: రాష్ట్ర విభజనపై సుప్రీంలో పిటిషన్ వేస్తాం: పయ్యావుల
రాష్ట్ర విభజన అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ, దశలవారీగా పిటిషన్ వేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నామని చెప్పారు. ఈ వ్యవహారంతో పార్టీకి సంబంధం లేదని, వ్యక్తిగతంగానే పిటిషన్ వేయనున్నామని స్పష్టం చేశారు. నవంబర్ 1లోగా పిటిషన్ వేసేందుకు సమాయత్తం అవుతున్నామని తెలిపారు. విభజన అంశంపై ఢిల్లీలో శరవేగంగా మార్పులు చోటు చేసుకోనున్నాయని అన్నారు.