: ఉండవల్లి కూడా మరోసారి రాజీనామా
ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా మరోసారి రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందట ఢిల్లీలో లోక్ సభ సెక్రటరీ జనరల్ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. గతంలో చేసిన రాజీనామాలు స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించిన కారణంగా ఉండవల్లి మరో ప్రయత్నం చేశారు. రాష్ట్ర విభజన తథ్యమంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో సీమాంధ్ర ఎంపీలు ఎలాగైనా తమ రాజీనామాలను ఆమోదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.