: రాష్ట్రపతికి రాజకీయాలు అంటగట్టొద్దు: టీఆర్ఎస్ వినోద్
రాజ్యాంగంతో సమానమైన రాష్ట్రపతిని తెలంగాణ విభజన అంశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించడాన్ని టీఆర్ఎస్ నేత వినోద్ తప్పుపట్టారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రపతికి, ఆయన కార్యాలయానికి రాజకీయాలు అంటగట్టడం మంచిది కాదని అన్నారు. తెలంగాణ అంశంపై ప్రణబ్ కు పూర్తి అవగాహన ఉందని, 2004 లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుపై ఆయన కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. సీమాంధ్ర నేతలు రాజ్యాంగంపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలని అన్నారు. రాష్ట్ర విభజనకు మానసికంగా ఒప్పుకుని, సీమాంధ్రుల న్యాయం కోసం పాటుపడాలని ఆయన సూచించారు. ఒకరికి గెలుపు, మరొకరికి ఓటమి లేని విభజన ప్రక్రియను తాము స్వాగతిస్తామని వినోద్ అన్నారు.