: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం


భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేసిన అనంతరం భర్త పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. వివరాల్లోకెళితే.. గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన జ్యోతికి కొయ్యలగూడెం మండలం గంగవరం గ్రామానికి చెందిన కలిదిండి పాటియ్యతో 13 ఏళ్ల క్రితం పెళ్లైంది. పాటియ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఈడుగుబంటి శ్రీను(31) గత మూడేళ్లుగా జ్యోతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన పాటియ్య భార్యను కొట్టి పుట్టింటికి పంపేశాడు. 20 రోజుల క్రితం అత్తవారింటికి వచ్చిన పాటియ్య శనివారం రాత్రి నిద్రలో ఉండగా జ్యోతి ప్రియుడు శ్రీనుతో ఊరిబయటకు వెళ్లడాన్ని గమనించాడు.

ఊరి బయట భార్యతో ఆమె ప్రియుడు కలిసి ఉండగా తనతో తెచ్చుకున్న ఇనుప రాడ్ తో విచక్షణా రహితంగా కొట్టాడు. భార్య భయంతో పారిపోగా గాయపడ్డ శ్రీనును ఆటోలో వేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు నిర్ధారించడంతో శవంతో సహా ప్రక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. హంతకుడికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య మాత్రం పథకం ప్రకారం తన భర్తను హత్య చేశారని ఆరోపిస్తోంది.

  • Loading...

More Telugu News