: బంగారం తవ్వకాల పర్యవేక్షణకు సుప్రీం తిరస్కృతి


ఉత్తరప్రదేశ్ లోని దాండియాఖేరా గ్రామం పురాతన కోటలో జరుగుతున్న బంగారం అన్వేషణపై పర్యవేక్షణకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. 1000 టన్నుల బంగారం బయటపడితే మాయం కాకుండా, తగిన భద్రత కల్పించాలని, కోర్టు పర్యవేక్షణ ఉండాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం నేడు విచారించింది. ప్రతీ విషయంలోనూ జోక్యం చేసుకోలేమని, నాలుగు వారాల తర్వాత తమ నిర్ణయాన్ని మరోసారి సమీక్షిస్తామని చెప్పింది. అన్వేషణకు మూడు నుంచి నాలుగు వారాలు పడుతుందని భావిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News