: అస్త్రాలకు పదునుపెడుతున్న సచిన్


భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆటకు వీడ్కోలు పలకనున్న నేపథ్యంలో చివరి టెస్టుకు సన్నాహాలు మొదలు పెట్టాడు. వచ్చే నెలలో విండీస్ తో ముంబైలో జరిగే టెస్టు సచిన్ కు 200వది. ఆ మ్యాచ్ అనంతరం సచిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతాడు. ఈ క్రమంలో ఈ బ్యాటింగ్ యోధుడు తన అస్త్రాలకు పదును పెట్టుకునేందుకు రంజీ బరిలో దిగాలని నిశ్చయించుకున్నాడు. తాజా రంజీ సీజన్ లో ముంబై జట్టు హర్యానాతో తలపడనుంది. ఈ దేశవాళీ పోరుకు తాను అందుబాటులో ఉంటానని సచిన్ ముంబై క్రికెట్ సంఘానికి సమాచారం ఇచ్చాడు. దీంతో, ఈ దిగ్గజాన్ని కూడా ముంబై జట్టులో చేర్చారు. కాగా, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోనూ ఇక సచిన్ కొనసాగే అవకాశాల్లేవు. ఈ నేపథ్యంలో హర్యానాతో మ్యాచే సచిన్ కు చివరి రంజీ కానుంది. ఈ పోరు అక్టోబర్ 27న ఆరంభం కానుంది.

  • Loading...

More Telugu News