: సీఎం వ్యవహారం రైలెళ్లిపోయాక రెడ్ లైట్ వేసినట్టుంది: యనమల
సిగ్నల్ దాటి రైలు వెళ్లిపోయాక రెడ్ లైట్ వేసినట్లు ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన ఆపాలనుకుంటే సీడబ్ల్యూసీ నిర్ణయం రోజే ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. జగన్, కిరణ్ ఇద్దరూ సమైక్యవాదులు కాదని విభజన నిర్ణయాన్ని అమలు చేయడంలో భాగంగా అలా నటిస్తున్నారని యనమల ఆరోపించారు. సోనియాను వీరిద్దరూ విమర్శించడం గేమ్ ప్లాన్ లో భాగమేనని ఆయన తెలిపారు.