: కాశ్మీర్ పై మరో దేశం జోక్యం అవసరం లేదు: షిండే
కాశ్మీర్ విషయంలో మరో దేశం జోక్యం చేసుకోవడాన్ని తాము స్వాగతించబోమని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. కాశ్మీర్ అంశంపై అమెరికా జోక్యం చేసుకోవాలంటూ పాక్ ప్రధాని చేసిన విజ్ఞప్తిపై ఆయన ఢిల్లీలో ఘాటుగా స్పందించారు. కాశ్మీర్ ఇరు దేశాలకు సంబంధించిన సమస్య అని, ఇందులో మూడో దేశం జోక్యానికి తావులేదని అన్నారు. నెహ్రూ హయాం నుంచీ ఇదే పద్ధతి అనుసరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.