: విజయనగరంలో 144 సెక్షన్ ఎత్తివేయాలని కోరాం: బొత్స
కొన్ని రోజులనుంచి విజయనగరంలో అమల్లో ఉన్న 144 సెక్షన్ ను ఎత్తివేయాలని అధికారులను కోరినట్లు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పోలీసు అధికారులతో చెప్పామన్నారు. విజయనగరంలో జరుగుతున్న పైడితల్లమ్మ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను బొత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.