: పాక్ లో కాసులు కురిపిస్తున్న భారత ఏజెంట్ల కథ
పాకిస్థాన్ ఉగ్రవాదం కథాంశంగా, గూఢచార నేపథ్యంలో ఎన్నో కథలు బాలీవుడ్ సినిమాలుగా రూపుదిద్దుకుని బాక్సాఫీసుల వద్ద బంపర్ హిట్ కొట్టాయి. అచ్చంగా దీనికి రివర్స్ లో భారత గూఢచార ఏజెంట్లు పాక్ లో భారీ పేలుడుకు కుట్ర పన్నడమే కథాంశంగా రూపొందిన 'వార్' చిత్రం భారీ వసూళ్లను రాబట్టుకుంటోంది. బుధవారం పాకిస్థాన్ వ్యాప్తంగా 42 స్ర్కీన్లలో విడుదలవగా, వసూళ్లలో రికార్డును నమోదు చేసింది. శుక్రవారం రాత్రికి 4.50కోట్ల రూపాయలు వసూలు చేసింది. కథ విషయానికొస్తే..
పాక్ లో జరిగే అన్ని అనర్థాలకు భారతే కారణమని కథాంశంలో చూపుతారు. పాక్ లో అత్యంత అధికవ్యయంతో నిర్మించిన చిత్రంగా దీనిని పేర్కొంటున్నారు. ఈ చిత్రానికి పాక్ ఆర్మీ కూడా నిధుల సాయం అందించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇస్లామాబాదులోని పోలీస్ కాంపౌండులో బాంబు పేలితే.. పాకిస్థాన్ లో సామాజిక కార్యకర్త(భారత ఏజెంట్) విజయాన్ని ఆనందిస్తూ డాన్స్ చేస్తుంటుంది. సినిమాలో ఇది ఒక సీన్. అంటే భారతీయులను విలన్లుగా చూపించారనుకోవచ్చు.