: ఆసీస్ తో సిరీస్ పై దృష్టి పెట్టండి: గవాస్కర్
ప్రస్తుతం ఆసీస్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ పై దృష్టి పెట్టాలని, 2015 వరల్డ్ కప్ సన్నాహాలకు చాలా సమయముందని టీమిండియా మేనేజ్ మెంట్ కు భారత మాజీ సారథి సునీల్ గవాస్కర్ సూచించాడు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఇప్పటికే 1-2తో వెనకబడి ఉన్న దశలో సిరీస్ ను కాపాడుకోవడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నాడు. ఒకదాని వెంట మరో సిరీస్ కోల్పోతూ ఉంటే వచ్చే వరల్డ్ కప్ నాటికి జట్టులో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుందని అభిప్రాయపడ్డాడు.
ఇక యువరాజ్ సింగ్ ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపాలనడం అర్థరహితమన్నాడు. గత ప్రపంచకప్ లో యువీ ఐదోస్థానంలో వచ్చి రాణించాడని గుర్తు చేశాడు. బౌలర్లు పొరబాట్ల నుంచి గుణపాఠాలు నేర్వడంలేదని, ఇది దురదృష్టకర పరిణామమని పేర్కొన్నాడు.