: మావోయిస్టు అగ్రనేత అరెస్ట్
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు శివన్నారాయణ పోలీసులకు పట్టుబడ్డారు. మావోయిస్టు కార్యకలాపాలలో జాతీయ స్థాయిలో శివన్నారాయణ కీలక బాధ్యతలు నిర్వర్తించేవారు. ఆయనపై 5 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. మెదక్ జిల్లా గజ్వేల్ లో మూడు రోజుల క్రితమే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.