: రోడ్డు ప్రమాదంలో గాయపడిన పర్యావరణవేత్త
పర్యావరణ వేత్త సునీతా నరైన్ నిన్న (ఆదివారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ ఢిల్లీ గ్రీన్ పార్క్ ప్రాంతంలో నివాసముంటున్న సునీతా లోధి గార్డెన్ సమీపంలో సైకిల్ నడుపుతుండగా వెనకవైపు నుంచి వచ్చిన ఓ కారు ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో సునీతాకు రెండు భుజాల వద్ద, ఛాతి భాగంలో గాయాలయ్యాయి. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.