: విజయనగరంలో పైడితల్లమ్మ ఉత్సవాలు


ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మ ఉత్సవాలు నేడు, రేపు జరగనున్నాయి. ఈరోజు తొలేళ్ల ఉత్సవాన్ని, రేపు సిరిమాను ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. నెల రోజుల సంబరాల్లో భాగంగా ఈ నెల ఏడో తేదీ నుంచి అమ్మవారికి పూజలు ప్రారంభమవగా నవంబరు ఆరో తేదీతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన దేవస్థానం, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశాయి.

  • Loading...

More Telugu News