: మళ్లీ రాజీనామా చేయనున్న లగడపాటి
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఢిల్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తన రాజీనామా పత్రాన్ని స్వయంగా అందజేయనున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ గతంలో చేసిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ రెండురోజుల కిందట తిరస్కరించారు. ఈ నేపథ్యంలో లగడపాటి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.