: చివరి నాలుగు వన్డేలకు ఇషాంత్ స్థానం పదిలం


ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి నాలుగు వన్డే మ్యాచ్ లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తుది జట్టును ప్రకటించింది. తొలి మూడు మ్యాచులకు ఎంపిక చేసిన జట్టునే రానున్న నాలుగు మ్యాచ్ లకు కొనసాగించాలని సెలెక్టర్లు నిర్ణయించారు. మొహాలీలో జరిగిన మూడో వన్డేలో 48వ ఓవర్లో ఏకంగా 30 పరుగులు సమర్పించుకుని భారత్ ఓటమికి కారకుడైన ఇషాంత్ శర్మకు తుది జట్టులో స్థానం దక్కదని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ సెలెక్టర్లు ఇషాంత్ ను చివరి నాలుగు వన్డేలకు కొనసాగించాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News