: పేలుళ్ల మృతులకు భారత్, ఆసీస్ క్రికెటర్ల నివాళి


జంట పేలుళ్ల ఘటనలో మరణించిన వారికి ఈరోజు భారత, ఆస్ట్రేలియా క్రికెటర్లు సంతాపం ప్రకటించారు. వాస్తవానికి తొలి రోజు ఆట ఆరంభానికి ముందే నివాళి కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నా.. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆ విషయాన్నివిస్మరించింది.

దీంతో పొరబాటు జరిగిందని తెలిసి నాలిక్కరుచుకున్న హెచ్ సీఏ  రెండో రోజు ఆట మొదలవకముందే ఆ కార్యక్రమం పూర్తి చేసింది. ఆదివారం ఉదయం ఇరు జట్ల ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల మృతులకు అంజలి ఘటించారు. 

  • Loading...

More Telugu News