: కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మృతి
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో మిర్తిపాడు వాగులో కొట్టుకుపోయిన కారును పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. కారులో నుంచి కొట్టుకుపోయిన వ్యక్తుల కోసం గాలించిన పోలీసులకు, ప్రమాద స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బొబ్బర్లంక ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలు లభించాయి. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.