: పదేళ్లలో మీరేం సాధించారు? : బీజేపీ
బీజేపీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పరిపాలనపై విమర్శలకు దిగుతున్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మోడీ పాలనపై విమర్శలు చేసే ముందు మీ పదేళ్ల పాలనలో ఏం సాధించారో ప్రజలకు వివరించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నక్వీ డిమాండ్ చేశారు. కుంభకోణాలు, అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్ధిక ఒడిదుడుకులు ఇవేనా మీరు సాధించిన ఘనతలు అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి బాటలో పురోగమించిన సంగతి నిజం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రంధ్రాన్యేషణ చేయడం తగదని నక్వీ హితవు పలికారు.