: మా నలుపు సంగతి సరే ... మీ ఎరుపు మాటేమిటి? : సల్మాన్ ఖుర్షీద్


బీజేపీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ విమర్శల వర్షం కురిపించారు. బొగ్గు స్కాం ఆరోపణలపై ప్రధాని రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ వాటిని తిప్పికొట్టింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ప్రధాని రాజీనామా చేయాల్సిన అవసరమేమిటని కాంగ్రెస్ ప్రశ్నించింది. కాంగ్రెస్ చేతికి నలుపు అంటుకుందన్న మోడీ వ్యాఖ్యలపై ఖుర్షీద్ విరుచుకుపడ్డారు. 'మా నలుపు సంగతి సరే ... మీ ఎరుపు మాటేమిటని' ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన నల్లగా ఉన్న ప్రజలకు సేవలు చేస్తుందని అన్నారు. గోద్రా అల్లర్లలో రక్తాన్ని ఏరులా పారించి మోడీ ప్రభుత్వం ఎరుపు రంగును పూసుకుందని ఆయన ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరుపుతున్నందున దీన్ని రాజకీయ కోణంలో చూడటం ఏ పార్టీకి తగదన్నారు.

  • Loading...

More Telugu News