: పాకిస్థాన్ నేపథ్యగాయని జుబైదా కన్నుమూత
ప్రముఖ పాకిస్థానీ నేపథ్యగాయని, నటి జుబైదా ఖానమ్(78) నిన్న గుండెపోటుతో కన్నుమూశారు. భారత్ లోని అమృత్ సర్ లో 1935 లో జన్మించిన ఆమె... చిన్నతనంలోనే తన కుటుంబం పాకిస్థాన్ వలస వెళ్ళడంతో అక్కడే స్థిరపడ్డారు. ప్రముఖ కెమెరామెన్ రియాజ్ భోకరిని ఆమె వివాహమాడారు. అక్టోబర్ 19 నే రియాజ్ కూడా మృతి చెందినట్టు వీరి కుమారుడు పైసల్ భోకరి తెలిపాడు. కాగా జుబైదా మృతి పట్ల పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంతాపం తెలిపారు.