: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో షిల్లాంగ్ లో భద్రత కట్టుదిట్టం
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపటి నుంచి రెండు రోజుల పాటు షిల్లాంగ్ లో పర్యటించనున్నారు. ఈస్టర్న్ హిల్స్ విశ్వవిద్యాలయంలో జరగనున్న స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించనున్నారు. ఆయన పర్యటనను దృష్టిలో ఉంచుకుని మిలిటెంట్లు 36 గంటలపాటు షిల్లాంగ్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో షిల్లాంగ్ లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో పోలీసులు, పారామిలిటరీ దళాలు ఎయిర్ పోర్ట్ నుంచి రాష్ట్రపతి పయనించే మార్గంలో తనిఖీలు చేపట్టారు.